కాటుక కనులే... పుట్టిస్తుంది కలలే!
ABN , First Publish Date - 2023-01-21T05:37:58+05:30 IST
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కశ్మీర కథానాయిక. బన్నీ వాసు నిర్మాత...
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కశ్మీర కథానాయిక. బన్నీ వాసు నిర్మాత. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు. శుక్రవారం ‘బంగారం’ అనే గీతాన్ని విడుదల చేశారు. ‘కాటుక కనులే... పుట్టిస్తుంది కలలే’ అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కర భట్ల రవికుమార్ రచించారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందించారు. కపిల్ కపిలన్ ఆలపించారు. ‘‘తిరుమల తిరుపతి నేపథ్యంలో సాగే కథ ఇది. తొలి పాట ‘వాసవసుహాస’ గీతానికి చక్కటి స్పందన లభించింది. టీజర్ కూడా ఆకట్టుకొంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సమర్పణ: అల్లు అరవింద్.