బిరియానీ.. ఇరానీ చాయ్‌.. లింగొచ్చా

ABN , First Publish Date - 2023-10-25T01:32:54+05:30 IST

‘‘హైదరాబాద్‌లో బిరియానీ, ఇరానీ చాయ్‌ ఎంత ఫేమసో.. మా లింగొచ్చా కూడా అంతే ఫేమస్‌ అవుతాడ’’న్నారు ఆనంద్‌ బడా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘లింగొచ్చా’...

బిరియానీ.. ఇరానీ చాయ్‌.. లింగొచ్చా

‘‘హైదరాబాద్‌లో బిరియానీ, ఇరానీ చాయ్‌ ఎంత ఫేమసో.. మా లింగొచ్చా కూడా అంతే ఫేమస్‌ అవుతాడ’’న్నారు ఆనంద్‌ బడా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘లింగొచ్చా’. గేమ్‌ ఆఫ్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక. కార్తీక్‌ రత్నం దర్శకుడు. యాదగిరి రాజు నిర్మాత. ఈనెల 27న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో కార్తీక్‌రత్నం మాట్లాడుతూ ‘‘ఓ కొత్త తరహా ప్రేమకథకు మంచి వినోదాన్ని జోడించిన సినిమా ఇది. హైదరాబాదీ కుర్రాడిలా నటించా. ఈ సినిమాలో నటించడం మంచి అనుభవాన్ని అందించింద’’న్నారు. ‘‘పూర్తి స్థాయి రొమాంటిక్‌ కామెడీ సినిమా ఇది. హీరో, హీరోయిన్‌లకు మంచి పేరొస్తుంద’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-10-25T01:32:54+05:30 IST