అభిమానుల ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుక
ABN , First Publish Date - 2023-10-25T01:36:20+05:30 IST
ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు ఆయన అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే...

ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు ఆయన అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ భారీ కటౌట్‌ను అభిమానులు ఆవిష్కరించారు. దానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి పుట్టిన రోజును నిర్వహించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి, రామకృష్ణ, గోవింద్ తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం డిసెంబర్ 22న వస్తుందని, ఆ సినిమా మాములుగా ఉండదని అసోనియేషన్ నాయకుడు శాస్త్రి అన్నారు. తండ్రి సూర్యనారాయణరాజు, పెదనాన్న కృష్ణంరాజు అశీస్సులు ప్రభా్‌సకు ఎప్పుడూ ఉంటాయనీ, తనకు తానుగా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‘సలార్’తో ఇండస్ట్నీ రికార్డులు తిరగరాయాలని మరో నాయకుడు రామకృష్ణ కోరారు. ప్రభాస్ రాబోయే సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలని ఇంకో నాయకుడు గోవింద్ అన్నారు.