Bigg boss Surprise : డాక్టర్‌గా వచ్చాడు.. ఒక్కసారిగా చూసి తట్టుకోలేకపోయాడు

ABN , First Publish Date - 2023-11-07T13:57:50+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 (Biggboss 7) పదో వారానికి చేరుకుంది. బిగ్‌బాస్‌ మాత్రం టాస్క్‌లతో ఆడుకుంటూనే ఉన్నాడు. తాజాగా బిగ్‌బాస్‌ ఇచ్చిన ఎమోషనల్‌ సర్‌ప్రైజ్‌కు శివాజీ (shivaji) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

Bigg boss Surprise : డాక్టర్‌గా వచ్చాడు.. ఒక్కసారిగా చూసి తట్టుకోలేకపోయాడు

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 (Biggboss 7) పదో వారానికి చేరుకుంది. ఉల్టా పుల్టా సీజన్ లో ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. ఓ క్షణం ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ.. మరుక్షణమే మళ్లీ కలిసిపోతూ ఇంటి సభ్యులు ఆట ఆడుతున్నారు. బిగ్‌బాస్‌ మాత్రం టాస్క్‌లతో ఆడుకుంటూనే ఉన్నాడు. తాజాగా బిగ్‌బాస్‌ ఇచ్చిన ఎమోషనల్‌ సర్‌ప్రైజ్‌కు శివాజీ (shivaji) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన ప్రొమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఏం జరిగింది అంటే.. సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న శివాజీని డాక్టర్‌తో చెక్‌ చేయించాలని మెడికల్‌ రూమ్‌కు రమ్మన్నాడు. డాక్టర్‌ శివాజీతో మాట్లాడుతూ.. మీ చేయి ఎలా ఉందని, వర్కవుట్స్‌ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నాడు. ట్రీట్మెంట్‌ అయిపోయింది.. ఇక వెళ్లండి అని అంటూ తన ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగించి నాన్న.. అని పిలిచాడు. ఇంతకీ ఆ డాక్టర్‌గా వచ్చింది మరెవరో కాదు.. శివాజీ కుమారుడు. ఆ క్షణంలో తన కుమారుడిని చూసిన శివాజీ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే అతడిని హత్తుకుని హౌస్‌లోకి తీసుకువెళ్లాడు. డాక్టర్‌గా మా పెద్దబ్బాయిని పంపి బిగ్‌బాస్‌ నాకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడని కంటెస్టెంట్స్‌ అందరితో చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఉన్న కంటెంట్‌ ఇది. అది అందరి హృదయాలను హత్తుకుంటోంది. తాను యూనివర్సిటీకి వెళ్లిపోతున్నానని.. అందుకే చూడడానికి వచ్చినట్లు శివాజీ కుమారుడు చెప్పాడు. మళ్లీ ఎన్ని నెలలకు వస్తానో అనగానే.. శివాజీ కంటతడి పెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. మరో పక్క ఈ వారం నామినేషన్స కూడా జరుగుతున్నాయి. పదో వారానికి సంబంధించిన నామినేషన్స ప్రక్రియ మొదలైంది. శివాజీతో పాటు రతిక, భోలే షావలి, గౌతమ్‌, ప్రిన్స్‌ యావర్‌ నామినేషన లిస్ట్‌లో ఉన్నారు.

Updated Date - 2023-11-07T13:58:28+05:30 IST