సందేశంతో ‘భీమదేవరపల్లి’
ABN , First Publish Date - 2023-02-13T00:44:16+05:30 IST
అంజి వల్గుమన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచ్’...
అంజి వల్గుమన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచ్’. రమేశ్ చెప్పాల దర్శకుడు. బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మాతలు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. టీజర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా తప్పకుండా చూస్తాన’’న్నారు.