భీమదేవరపల్లి బ్రాంచిలో ఏం జరిగింది?
ABN , First Publish Date - 2023-04-21T23:23:32+05:30 IST
బలగం’ సుధాకర్‌రెడ్డి, అంజి వల్లమాన్ ప్రఽధాన పాత్రలు పోషించిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.

‘బలగం’ సుధాకర్‌రెడ్డి, అంజి వల్లమాన్ ప్రఽధాన పాత్రలు పోషించిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. రమేశ్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, నరేందర్ చెల్లపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ మాట్లాడుతూ ‘మంచి కథను కామెడీ వేలో చెప్పాం. జనానికి బాగా రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన ‘ఎల్లమ్మ’ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా త్వరలో విడుదల చేస్తాం’ అని చెప్పారు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఈ సినిమాలో నటించారని ఆమె చెప్పారు. సినిమా బాగా వచ్చిందనీ, తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందనీ దర్శకడు రమేశ్ చెప్పారు.