భయపెట్టే తంతిరం

ABN , First Publish Date - 2023-09-14T00:30:17+05:30 IST

భార్యాభర్తల మధ్య ఓ ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ‘తంతిరం’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది...

భయపెట్టే తంతిరం

భార్యాభర్తల మధ్య ఓ ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ‘తంతిరం’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వంలో శ్రీకాంత్‌ కంద్రగుల నిర్మించారు. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. థియేటర్‌లో ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీలవుతారు’ అని చెప్పారు. ‘నా కెరీర్‌లో ఇది చాలా పెద్ద మూవీ అవుతుంది. సినిమా అందరినీ భయపెడుతుంది’ అన్నారు. చాలా తక్కువ రోజుల్లో సినిమా తీశామనీ, ప్రతి ఒక్కరికీ గుర్తుండి పోయే చిత్రం ఇదనీ శ్రీకాంత్‌ గుర్రం చెప్పారు ‘నేను ఓవర్సీస్‌లో చాలా చిత్రాలు విడుదల చేశాను. ‘తంతిరం’ చిత్రం ఈ నెల 22న విడుదలై అందరినీ అలరిస్తుంది’ అని నిర్మాత శ్రీకాంత్‌ చెప్పారు.

Updated Date - 2023-09-14T00:30:17+05:30 IST