భయపెట్టే చిత్రం

ABN , First Publish Date - 2023-10-20T02:34:56+05:30 IST

శ్రీకాంత్‌ శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటిస్తున్న హారర్‌ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉపశీర్షిక. సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయ మవుతున్నారు....

భయపెట్టే చిత్రం

శ్రీకాంత్‌ శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటిస్తున్న హారర్‌ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉపశీర్షిక. సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. యశ్వంత్‌ నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇంతటి భయంకర హారర్‌ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూసి ఉండరు. విభిన్న కాలాల్లో జరిగే సంఘటనల నేపథ్యంలో సినిమా సాగుతుంది’ అన్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 30న, చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్‌, రవివర్మ కీలకపాత్రలు పోషించారు. సంగీతం: కృష్ణ సౌరభ్‌ సూరంపల్లి. సినిమాటోగ్రఫీ: సతీశ్‌ మనోహర్‌. ఎడిటర్‌: శిరీశ్‌ ప్రసాద్‌.

Updated Date - 2023-10-20T02:34:56+05:30 IST