దేవరతో భైరా పోరు
ABN , First Publish Date - 2023-08-17T04:08:18+05:30 IST
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు...

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. బుధవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘దేవర’ చిత్రం నుంచి సైఫ్ ఫస్ట్‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆయన ‘భైరా’ అనే పాత్రలో చాలా క్రౌర్యంగా కనిపించారు. జాన్వీకపూర్ కథానాయిక. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.