భాయ్ వచ్చాడు
ABN , First Publish Date - 2023-09-01T04:02:21+05:30 IST
ఆదిత్య గంగసానిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ అభిషేక్ పిక్చర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రణయ్ మైకల్ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత...

ఆదిత్య గంగసానిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ అభిషేక్ పిక్చర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రణయ్ మైకల్ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత. ఈ చిత్రానికి ‘ఘన్నుభాయ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది ఉపశీర్షిక. గురువారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆదిత్య డ్రమ్స్ వాయిస్తూ మాస్ అవతార్‌లో దర్శనమిచ్చాడు. ‘‘ప్రతిభావంతులైన యువ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ ప్రధాన ఆకర్షణ’’ అని నిర్మాత తెలిపారు. వచ్చే యేడాది మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. సంగీతం: అభే.