Bhagat Singh : భగత్ సింగ్... సూపర్ ఫాస్ట్!
ABN , First Publish Date - 2023-04-16T01:13:22+05:30 IST
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్.. భగత్‌సింగ్’. శ్రీలీల కథానాయిక. మైత్రీమూవీస్ సంస్థ రూపొందిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్...

పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్.. భగత్‌సింగ్’. శ్రీలీల కథానాయిక. మైత్రీమూవీస్ సంస్థ రూపొందిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. 8 రోజుల పాటు సాగిన తొలి షెడ్యూల్‌లో ఓ భారీ పోరాట సన్నివేశంతో పాటు, కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ ఫైట్‌ని రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ - హరీశ్ కాంబోలో ఇది వరకు ‘గబ్బర్‌సింగ్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకొంది. అందుకే ‘ఉస్తాద్..’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘గబ్బర్’లానే ‘ఉస్తాద్’లో కూడా పవన్ పోలీస్‌గానే దర్శనమివ్వబోతున్నాడు.