సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భాగ్‌ సాలే బాగా నవ్విస్తుంది

ABN, First Publish Date - 2023-07-05T02:38:22+05:30

‘నేను చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తున్నా. క్రైమ్‌ కామెడీలు చాలా తక్కువగా వచ్చాయనిపించింది. తక్కువ వచ్చినా ఎక్కువ హిట్స్‌ ఉన్నాయి. అందుకే అలాంటి మూవీ ఎందుకు తీయకూడదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నేను చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తున్నా. క్రైమ్‌ కామెడీలు చాలా తక్కువగా వచ్చాయనిపించింది. తక్కువ వచ్చినా ఎక్కువ హిట్స్‌ ఉన్నాయి. అందుకే అలాంటి మూవీ ఎందుకు తీయకూడదని ‘భాగ్‌ సాలే’ చిత్రం తీశాం. ప్రేక్షకులను ఈ సినిమా బాగా నవ్విస్తుంది. సురేశ్‌ సంస్థ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది’ అని చెప్పారు నిర్మాత అర్జున్‌ దాస్యన్‌. శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల ఏడున విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు అర్జున్‌ దాస్యన్‌.

  • ‘ప్రణీత్‌ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. చెప్పిన విధంగా సినిమా తీయగలడా అని భయం కూడా కలిగింది. తొలి కాపీ చూసిన తర్వాత ఆ భయం పోయింది. నేను అనుకున్న దానికంటే పది రెట్లు బాగా తీశాడు ప్రణీత్‌. హీరో శ్రీసింహాకు ఈ జానర్‌ బాగా సెట్‌ అవుతుంది. సంగీత దర్శకుడిగా కాలభైరవ ఉండాలని ముందే అనుకున్నాం.’ అని చెప్పారు అర్జున్‌ .

  • ‘సినిమాలో క్రైమ్‌, కామెడీ సమానంగా ఉంటాయి. నవ్విస్తూ సరదాగా సినిమా సాగిపోతుంది. సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుకుంటూనే ఉంటారు. జాన్‌ విజయ్‌ విలన్‌గా నటించారు. మా సంస్థ నుంచి ఇది మూడో చిత్రం. ‘డియర్‌ మేఘ’ సినిమాను కన్నడంలో రీమేక్‌ చేశాం. కానీ సినిమా విడుదల రోజే వాళ్లు యూ ట్యూబ్‌లో వేయడంతో మాకు బాగా నష్టం కలిగింది. ఆ సినిమా తర్వాత రీమేక్స్‌ చేయకూడదని అనుకున్నా.’ అన్నారు.

  • ‘మత్తు వదలరా’ సినిమాకు కాలభైరవ మంచి సంగీతం అందించారు. ‘కార్తికేయ’ చిత్రానికీ మ్యూజిక్‌ బాగుంది. అందుకే అలాంటి సంగీతం ఈ సినిమాకు కావాలని ఆయన్ని అడిగాం. మంచి పాటలు ఇచ్చారు. మా సినిమాతో పాటు ఏడున చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిల్లో మా సినిమా జానర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా విడుదలకు థియేటర్ల సమస్య లేదు. తెలుగులో రెస్పాన్స్‌ను బట్టి ఇతర భాషల్లో విడుదల గురించి ఆలోచిస్తాం. ప్రియదర్శి హీరోగా మరో సినిమా తీస్తున్నాం’ అని తెలిపారు అర్జున్‌.

Updated Date - 2023-07-05T02:38:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!