Beyond the action : యాక్షన్‌కు మించి...
ABN , First Publish Date - 2023-08-11T02:46:08+05:30 IST
‘‘గాంఢీవధారి అర్జున’ సినిమా ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోద్దు, అంతకు మించిన ఎమోషన్స్ ఉన్నాయి’ అని వరుణ్‌తేజ్ అన్నారు...

‘‘గాంఢీవధారి అర్జున’ సినిమా ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోద్దు, అంతకు మించిన ఎమోషన్స్ ఉన్నాయి’ అని వరుణ్‌తేజ్ అన్నారు. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. ఈ నెల 25న విడుదలవుతోంది. గురువారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ప్రవీణ్ సత్తారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. సామాజిక పర్యావరణ స్పృహతో ఓ చిత్రం చేస్తున్నప్పుడు అందులో భాగమవడం నటుడిగా నా బాధ్యత అనిపించింది. ‘గాంఢీవధారి...’లో దేశానికి వచ్చిన సమస్య ఏమిటో చూపించాం. థియేటర్స్‌లో చూస్తే ‘మనమధ్యన ఇలా జరుగుతోందా...’ అని ఆశ్చర్యపడేలా ఉంటుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘వరుణ్‌తేజ్‌తో మేం చేసిన ‘తొలిప్రేమ’ హిట్టయింది. గాంఢీవధారి అర్జున’ కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సామాజిక సందేశం ఉంది. యూరప్, అమెరికాల్లో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘భూమిపైన ఉన్న వనరులను మనం ఇష్టానుసారం వాడుతున్నాం. గ్లోబర్ వార్మింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది’ అని చెప్పారు. ఈ సినిమాలో నన్ను తెరపైన అద్భుతంగా చూపించారు అని సాక్షి వైద్య చెప్పారు.