నిజానికీ.. అబద్ధానికీ మధ్య!

ABN , First Publish Date - 2023-10-02T01:20:39+05:30 IST

భరత్‌, విషికా లక్ష్మణ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర టి. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు...

నిజానికీ.. అబద్ధానికీ మధ్య!

భరత్‌, విషికా లక్ష్మణ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర టి. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రదీప్‌ కుమార్‌ నిర్మాత. ఇటీవల నటుడు శ్రీకాంత్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజాలు కావు. ఆధారాలు లేనివన్నీ అబద్ధాలు కావు. ఈ పాయింట్‌ చుట్టూ తిరిగే కథ ఇది. థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు ఓ ఎమోషన్‌ లవ్‌ స్టోరీ ఈ కథలో ఉంది. ఈనెల 6న విడుదల చేస్తున్నామ’’న్నారు.

Updated Date - 2023-10-02T01:20:39+05:30 IST