నిధికీ.. డెవిల్‌కీ మధ్య!

ABN , First Publish Date - 2023-08-23T02:14:20+05:30 IST

‘రైడ్‌’, ‘రాక్షసుడు’ చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు రమేశ్‌ వర్మ. ఇప్పుడు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనికి ‘శివోహం’ అనే టైటిల్‌ ఖారారు చేశారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

నిధికీ.. డెవిల్‌కీ మధ్య!

‘రైడ్‌’, ‘రాక్షసుడు’ చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు రమేశ్‌ వర్మ. ఇప్పుడు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనికి ‘శివోహం’ అనే టైటిల్‌ ఖారారు చేశారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం రమేశ్‌ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. మూసేసిన గుడి ద్వారం.. దాని ముందు త్రిశూలం, చుట్టూ పూజా సామాగ్రితో పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘‘అంతుచిక్కని నిధికీ, ఓ డెవిల్‌కీ మధ్య నడిచే యుద్ధం’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు. సంతోష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఓ స్టార్‌ హీరో ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. కథానాయకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

Updated Date - 2023-08-23T02:14:39+05:30 IST