‘స్వయంభూ’ ప్రారంభం

ABN , First Publish Date - 2023-08-19T01:35:07+05:30 IST

‘కార్తికేయ 2’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న నిఖిల్‌ 20 చిత్రం ‘స్వయంభూ’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు....

‘స్వయంభూ’ ప్రారంభం

‘కార్తికేయ 2’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న నిఖిల్‌ 20 చిత్రం ‘స్వయంభూ’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. భువన్‌, శ్రీకర్‌ నిర్మాతలు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నిచ్చారు. దిల్‌రాజు స్విచ్చాన్‌ చేశారు. రామ జోగయ్య శాస్ర్తి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నిఖిల్‌ 20వ చిత్రమిది. గుర్తుండిపోయే స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. ఈరోజు నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలెట్టామ’’ని నిర్మాతలు తెలిపారు. నిఖిల్‌ సరసన సంయుక్త మీనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, సమర్పణ: ఠాగూర్‌ మధు.

Updated Date - 2023-08-19T01:35:07+05:30 IST