హీరోగా నిలబెడుతుంది

ABN , First Publish Date - 2023-11-17T02:55:34+05:30 IST

‘‘అన్వేషి’ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక నా నటనకు మంచి స్పందన వచ్చింది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నాయి...

హీరోగా నిలబెడుతుంది

‘‘అన్వేషి’ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక నా నటనకు మంచి స్పందన వచ్చింది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమా కథానాయకుడిగా నన్ను ఇండ స్ట్రీలో నిలబెడుతుందనే నమ్మకం ఉంది’ అని విజయ్‌ ధరణ్‌ అన్నారు. ఆయన హీరోగా వీజే ఖన్నా దర్శకత్వం వహించిన చిత్రమిది. నేడు విడుదలవుతున్న సందర్భంగా విజయ్‌ ధరణ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘అన్వేషి’ లవ్‌, థ్రిల్లర్‌ చిత్రమని చెప్పవచ్చు. ఓ మారుమూల గ్రామంలో ఒక ఆత్మవల్ల జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది. నేను డిటెక్టివ్‌ పాత్ర పోషించాను. మంచి ప్రేమకథతో పాటు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సీక్వెన్స్‌లు ఉన్నాయు. మా నిర్మాత టి. గణపతి రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు కాబట్టే మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా అనుకుంటున్నాం’ అన్నారు.

Updated Date - 2023-11-17T02:55:35+05:30 IST