బలగం సినిమా కాదు.. జీవితం
ABN , First Publish Date - 2023-02-26T01:39:40+05:30 IST
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రదాన పాత్రలు పోషించిన చిత్రం ‘బలగం’. వేణు ఎల్లండి దర్శకుడు. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలు. దిల్ రాజు సమర్పకుడు...

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రదాన పాత్రలు పోషించిన చిత్రం ‘బలగం’. వేణు ఎల్లండి దర్శకుడు. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలు. దిల్ రాజు సమర్పకుడు. మార్చి 3న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించాం. చూసినవాళ్లంతా ‘ఇది సినిమా కాదు.. జీవితం’ అంటున్నారు. ఇది చాలా చిన్న సినిమా. ఈ సినిమా వెనుక నేనున్నాను కాబట్టి.. పెద్ద సినిమా అనుకోవొద్దు. ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ఇంత చిన్న కథను, చిన్న సినిమానీ వెనుకుండి నడిపిస్తున్న దిల్ రాజు గారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు.