ఆయుధం చేతబట్టి...
ABN , First Publish Date - 2023-08-23T02:00:55+05:30 IST
సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. మిలియన్ స్టూడియో సంస్థ నిర్మించింది...

సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. మిలియన్ స్టూడియో సంస్థ నిర్మించింది. సోమవారం టీజర్ విడుదల చేశారు. ‘‘యాక్షన్, ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇది. సూపర్ హ్యూమన్ కోసం అన్వేషణ జరుగుతుంటుంది. దాని చుట్టూ ఈ కథని నడిపాం. అసలు సూపర్ హ్యూమన్ ఎవరు? నిజంగానే అలాంటి శక్తులు ఉన్నాయా? అనేది ఆసక్తికరం. సత్యరాజ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయనకు ఈ సినిమా మరో ఇమేజ్ తీసుకొస్తుంద’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: జిబ్రాన్.