యదార్థ సంఘటనల సమాహారం అథర్వ
ABN, First Publish Date - 2023-11-28T06:00:02+05:30
‘‘ఓ క్రైమ్ జరిగినప్పుడు సాక్ష్యాలను సేకరించడంలో క్లూస్ టీమ్‌ది చాలా కీలకమైన పాత్ర. దాని చుట్టూ ఎవరూ సినిమా తీయలేదు. మేం ఆ ప్రయోగం చేశాం’...
‘‘ఓ క్రైమ్ జరిగినప్పుడు సాక్ష్యాలను సేకరించడంలో క్లూస్ టీమ్‌ది చాలా కీలకమైన పాత్ర. దాని చుట్టూ ఎవరూ సినిమా తీయలేదు. మేం ఆ ప్రయోగం చేశాం’’ అన్నారు మహేశ్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా కీలక పాత్రలు పోషించారు. సుభాష్ నూతలపాటి నిర్మాత. డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఇది. మర్డర్, రాబరీ సీన్ల చుట్టూ నడుస్తుంది. యదార్థ సంఘటనల్ని వాడుకొన్నాం. ద్వితీయార్థం చాలా కీలకం. ప్రతి పది నిమిషాలకూ ఓ ట్విస్ట్ వస్తుంది. ఆ మలుపులు ఎవరూ ఊహించలేరు. క్లూస్ టీమ్‌లో హీరో పని చేస్తుంటాడు. హీరోయిన్ ఓ రిపోర్టర్. ప్రతీ పాత్ర కథలో భాగంగానే వస్తుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన నేపథ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణ’’ అన్నారు.