అప్పట్లో స్వాతిముత్యం..

ABN , First Publish Date - 2023-01-25T01:34:39+05:30 IST

మనదేశం నుంచి ఆస్కార్‌కు 1957 నుంచి ఇప్పటివరకూ మొత్తం 54 చిత్రాలు ఆస్కార్‌ కోసం అధికారికంగా నామినేట్‌ అయ్యాయి...

అప్పట్లో స్వాతిముత్యం..

మనదేశం నుంచి ఆస్కార్‌కు 1957 నుంచి ఇప్పటివరకూ మొత్తం 54 చిత్రాలు ఆస్కార్‌ కోసం అధికారికంగా నామినేట్‌ అయ్యాయి. ఆస్కార్‌ అవార్డుల్లో షార్ట్‌ లిస్ట్‌ అయిన ఏకైక తెలుగు చిత్రం ‘స్వాతిముత్యం’. కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. ‘లగాన్‌’ తర్వాత ఇప్పటివరకూ మరే భారత చిత్రం ఆస్కార్‌ అవార్డుల తుది పోరు వరకూ వెళ్లలేదు. ‘స్వాతిముత్యం’ తర్వాత ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ కేటగిరిలో నామినేట్‌ అవడం గమనార్హం. ఇలా తెలుగు వారి కీర్తిని మరోసారి చాటి చెప్పిన చిత్రం ఇది.

Updated Date - 2023-01-25T01:34:46+05:30 IST