అప్పట్లో రోజూ మద్యం తాగేదాన్ని..

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:16 AM

హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ పనైపోయిందనుకుంటున్న తరుణంలో వరుస విజయాలతో ముందు వరుసలోకి దూసుకు వచ్చారు. ‘సలార్‌’ చిత్రంతో ఆమె ఖాతాలో ఈ ఏడాది మరో భారీ చిత్రం పడినట్లే...

అప్పట్లో రోజూ మద్యం తాగేదాన్ని..

హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ పనైపోయిందనుకుంటున్న తరుణంలో వరుస విజయాలతో ముందు వరుసలోకి దూసుకు వచ్చారు. ‘సలార్‌’ చిత్రంతో ఆమె ఖాతాలో ఈ ఏడాది మరో భారీ చిత్రం పడినట్లే. ఇటీవలే ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో తాను మద్యానికి అలవాటుపడ్డానని ఆ అలవాటును వదులుకోలేక చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె చెప్పారు. కాలేజీ స్నేహితులతో కలసి పబ్‌కు వెళ్లి రోజూ మద్యం తీసుకునేదాన్నని చెప్పారు. ‘ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కొన్నాళ్లకు అర్థం చేసుకున్నాను. దాంతో క్రమంగా ఆ అలవాటు నుంచి బయటపడ్డాను. 8 ఏళ్లుగా మద్యానికి దూరంగా ఉంటున్నాను. ఇప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది నా దగ్గర ఆ ప్రస్తావన తెస్తే నేను సున్నితంగా తిరస్కరిస్తాను’ అని అన్నారు. శ్రుతీ ప్రస్తుతం అడివి శేష్‌ సరసన ‘డెకాయిట్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 05:16 AM