ఏడు గంటల పదకొండు నిమిషాలకు...
ABN , First Publish Date - 2023-06-13T04:00:08+05:30 IST
సాహస్, దీపిక నటించిన చిత్రం ‘7:11 పీఎమ్’. చైతు మాదాల దర్శకత్వం వహించారు. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యయి...
సాహస్, దీపిక నటించిన చిత్రం ‘7:11 పీఎమ్’. చైతు మాదాల దర్శకత్వం వహించారు. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యయి. ఈనెల 30న మైత్రీ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. 7 గంటల 11 నిమిషాలకు ఏం జరగబోతోంది? అనేది చాలా ఆసక్తికరం. అందుకే ఆ టైటిల్ నిర్ణయించాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింద’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: జ్ఞాని.