యువతను అలరించే వేగంతో

ABN , First Publish Date - 2023-10-23T01:14:56+05:30 IST

యువతను అలరించే కొత్త తరహా కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పీడ్‌ 220’. గణేశ్‌, హేమంత్‌, జాహ్నవీ శర్మ, ప్రీతిసుందర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు...

యువతను అలరించే వేగంతో

యువతను అలరించే కొత్త తరహా కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పీడ్‌ 220’. గణేశ్‌, హేమంత్‌, జాహ్నవీ శర్మ, ప్రీతిసుందర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షా బెజగం దర్శకత్వంలో సూర్యనారాయణ, దుర్గారావు, ఆనంద్‌ నిర్మించారు. టీజర్‌ను నిర్మాత సీ కల్యాణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని హర్షా బెజగం తెలిపారు. ఈతరం యువత ఆలోచనలకు మా చిత్రం అద్దంపడుతుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ మోపూరి. సినిమాటోగ్రఫీ: క్రాంతి కుమార్‌

Updated Date - 2023-10-23T01:14:56+05:30 IST