విద్య ప్రాధాన్యం చాటే ‘అభిలాష’
ABN , First Publish Date - 2023-04-20T03:29:25+05:30 IST
విద్య ప్రాధాన్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపుదిద్దుకొన్న ‘అభిలాష’ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం సాయంత్రం ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు హాస్య నటుడు పృథ్వీ. అమర్‌దీప్ హీరోగా...

విద్య ప్రాధాన్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపుదిద్దుకొన్న ‘అభిలాష’ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం సాయంత్రం ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు హాస్య నటుడు పృథ్వీ. అమర్‌దీప్ హీరోగా, అశ్విని రెడ్డి హీరోయిన్‌గా నటించారు. శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో సి.హెచ్. శిరీష ఈ చిత్రం నిర్మించారు. ఈ కార్యక్రమంలో పృధ్వీ మాట్లాడుతూ ‘ఇప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. ట్రైలర్ బాగుంది. ఒక మంచి పాయింట్‌తో తీసిన ఈ సినిమా విజయవంతం కావాలి’ అన్నారు. ‘అసభ్యతకు తావు లేకుండా ఈ సినిమా తీశాం. విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని ఇందులో చూపించాం. 1983లో వచ్చిన చిరంజీవి ‘అభిలాష’ చిత్రానికీ , మా సినిమాకు కథాపరంగా ఎలాంటి సంబఽంధం లేదు. చదువు వద్దన్న విలన్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడనేది మా చిత్ర కథ ’అని దర్శకుడు చెప్పారు. పాత్రలకు సరిపోయే నటీనటుల్ని ఎన్నుకొని ఈ సినిమా తీశామని నిర్మాత శిరీష చెప్పారు. ఈ సినిమా తమ కెరీర్‌కు ఉపయోగపడుతుందని హీరో అమరదీప్, హీరోయిన్ అశ్విని చెప్పారు. నటులు సమ్మెట గాంధీ, అశోక్‌కుమార్ గీత రచయిత తిరుపతి, స్కీన్‌ప్లే రచియత పాండు చరణ్, సహ నిర్మాత వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.