అష్టలక్ష్మి వచ్చింది

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:39 AM

నిహారిక కొణిదెల నటిగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. సిక్స్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్న ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వరుణ్‌ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా...

అష్టలక్ష్మి వచ్చింది

నిహారిక కొణిదెల నటిగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. సిక్స్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్న ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వరుణ్‌ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘వెన్‌ ద క్రేజీ బికమ్స్‌ క్రేజీయర్‌’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక పోషిస్తున్న అష్టలక్ష్మి అకా ఏయస్‌ హెచ్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో నిహారిక స్టైలి్‌షగా నడుస్తూ కనిపించారు. ఆమె వెనుక డాలర్‌ ఇమేజ్‌ ఉంది. ఈ పాత్రని యూనిక్‌గా డిజైన్‌ చేసినట్లు దర్శకుడు చెప్పారు. తెలుగు సినిమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని పెర్మార్మెన్స్‌ ఓరియంటెడ్‌, యాక్షన్‌ డ్రివెన్‌ పాత్ర ఇదనీ, ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన తెలిపారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్న ఈ బహుభాషా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:39 AM