scorecardresearch

Ashish Vidyarthi Marriage: రియల్ లైఫ్‌ ‘మళ్లీ పెళ్లి’.. ఈ పోకిరి పోలీస్ అశిష్ విద్యార్థి పెళ్లాడిన ఈమె ఎవరంటే..

ABN , First Publish Date - 2023-05-25T20:08:45+05:30 IST

సీనియర్ సినీ నటుడు అశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. మే 25, 2023, గురువారం రోజున ఆయన అస్సాంలోని గువహటికి చెందిన రూపాలి బారువను పెళ్లాడారు. రూపాలి బారువ ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావడం విశేషం.

Ashish Vidyarthi Marriage: రియల్ లైఫ్‌ ‘మళ్లీ పెళ్లి’.. ఈ పోకిరి పోలీస్ అశిష్ విద్యార్థి పెళ్లాడిన ఈమె ఎవరంటే..

సీనియర్ సినీ నటుడు అశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. మే 25, 2023, గురువారం రోజున ఆయన అస్సాంలోని గువహటికి చెందిన రూపాలి బారువను (RupaliBarua) పెళ్లాడారు. రూపాలి బారువ ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావడం విశేషం. రూపాలికి కోల్‌కత్తాలో ఒక ఫ్యాషన్ స్టోర్ కూడా ఉంది. ఇరు కుటుంబ సభ్యుల, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరూ కోల్‌కత్తాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఉదయం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న (Ashish Vidyarthi RupaliBarua Marriage) ఈ జంట, సాయంత్రం గెట్-టుగెదర్‌లో పాలుపంచుకున్నారు. అయితే.. ఈ ఇద్దరికీ అసలు ఎక్కడ పరిచయం ఏర్పడింది, పెళ్లి వరకూ వీరి పరిచయం ఎలా వెళ్లిందనే విషయంలో అశిష్ విద్యార్థి గానీ, రూపాలి గానీ స్పష్టత ఇవ్వలేదు.

20230525_190432.jpg

రూపాలిని ఈ విషయం అడగ్గా.. కొంత కాలం క్రితం తమకు పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లాలని నిర్ణయించుకునే ఈ దిశగా అడుగులు వేశామని చెప్పారు. అయితే.. తమ వివాహాన్ని సింపుల్‌గా చేసుకోవాలని ముందుగానే డిసైడ్ అయ్యామని ఆమె తెలిపారు. తమ పరిచయం, ప్రేమ, పెళ్లి.. ఇదంతా వివరించి చెప్పాలంటే ఒక పెద్ద కథే ఉందని.. సమయం దొరికినప్పుడు అన్ని విషయాలను పంచుకుంటామని అశిష్, రూపాలి మీడియాకు వెల్లడించారు.

20230525_190405.jpg

జూన్ 19, 1962లో అశిష్ విద్యార్థి ఢిల్లీలో జన్మించాడు. 1986లో ఆయన సినీ కెరీర్ మొదలైంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, మరాఠి, బెంగాలీ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. మొత్తం 11 భాషల్లో అశిష్ విద్యార్థి నటించడం విశేషం. పోకిరి, అతిథి, రైటర్ పద్మభూషణ్, వరుడు, ఇస్మార్ట్ శంకర్, నాయక్, చిరుత, జనతా గ్యారేజ్, అలా మొదలైంది, భాయ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో అశిష్ విద్యార్థి తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ‘పోకిరి’ సినిమాలో అశిష్ విద్యార్థి పాత్ర ఏ రేంజ్‌లో పేలిందో ప్రత్యేకంగా చెప్పేదేముంది. ‘అతిథి’ సినిమాలో కూడా ఆయన గెటప్, డ్రగ్ ఎడిక్ట్‌గా ఆయన నటించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది.

Ashish-Vidyarthi.jpg

ఇదిలా ఉండగా.. అశిష్ విద్యార్థి సడన్‌గా పెళ్లి చేసుకున్న తీరు సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన, అన్ని విషయాలను పంచుకునే అశిష్ విద్యార్థి సడన్‌గా ఇలా పెళ్లి చేసుకుని 60 ఏళ్ల వయసులో కొత్తగా మరోమారు దాంపత్య బంధంలోకి అడుగుపెడతారని ఆయన ట్విటర్ ఫాలోవర్లు కలలో కూడా ఊహించలేదు. అశిష్ విద్యార్థి మొదటి భార్య పేరు రాజోషి విద్యార్థి. ముంబైలో అశిష్ విద్యార్థి నివాసం ఉంటున్నారు.

Updated Date - 2023-05-25T20:16:14+05:30 IST