భూమి ఉన్నంతవరకే... రైతే రాజు

ABN , First Publish Date - 2023-09-03T01:24:51+05:30 IST

సినిమా బండి క్రియేషన్స్‌, యుషిక్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించిన ‘111 గ్రీన్‌ జోన్‌’ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ‘రైతు భూమి ఉన్నంతవరకే రాజు..

భూమి ఉన్నంతవరకే... రైతే రాజు

సినిమా బండి క్రియేషన్స్‌, యుషిక్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించిన ‘111 గ్రీన్‌ జోన్‌’ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ‘రైతు భూమి ఉన్నంతవరకే రాజు.. ఒక్కసారి ఆ భూమి అమ్ముకున్నామా.. అదే భూమికి కూలీలు అయిపోతాం’ అనే వాయిస్‌ ఓవర్‌తో మొదలైన టైటిల్‌ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. టైటిల్‌ డిజైన్‌, నేపథ్య సంగీతం బాగున్నాయి. అనంతరం దర్శకుడు విజయ రాఘవేంద్ర మాట్లాడుతూ ‘మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. పెద్ద బడ్జెట్‌ ఉంటే పాన్‌ ఇండియా రేంజ్‌లో తీయాల్సిన సినిమా. ఎందుకంటే గ్రీన్‌ జోన్‌ అనేది మన దగ్గరే కాదు ఇండియా అంతా ఉంది.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఆర్టిస్టుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.

Updated Date - 2023-09-03T01:24:51+05:30 IST