వాళ్లందరికీ నివాళిగా.. సత్య

ABN , First Publish Date - 2023-08-16T03:30:50+05:30 IST

సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి జంటగా నటించిన షార్ట్‌ ఫీచర్‌ ‘సోల్‌ ఆఫ్‌ సత్య’. హర్షిత్‌, హన్షిత నిర్మాతలు. నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ మ్యూజిక్‌ షార్ట్‌ను రామ్‌ చరణ్‌ విడుదల చేశారు...

వాళ్లందరికీ నివాళిగా.. సత్య

సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి జంటగా నటించిన షార్ట్‌ ఫీచర్‌ ‘సోల్‌ ఆఫ్‌ సత్య’. హర్షిత్‌, హన్షిత నిర్మాతలు. నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ మ్యూజిక్‌ షార్ట్‌ను రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో ఎమోషనల్‌ జర్నీ. మనం ఎవరినైనా మిస్‌ అయితే ఆ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో ఈ పాటలో అందంగా చెప్పామ’’న్నారు. ‘‘ఈ దేశం కోసం సైనికులు ఎంతో త్యాగం చేస్తున్నారు. వాళ్లని సరిహద్దులకు పంపిస్తున్న తల్లులు, భార్యలు, చెల్లెళ్లు, అక్కలూ.. వాళ్లందరికీ నివాళిలాంటి ప్రయత్నం ఇద’’న్నారు సాయిధరమ్‌. ‘‘ఓ అమ్మాయి జీవితంలో ఎన్నో కలలు ఉంటాయి. అలాంటి అమ్మాయి జీవితంలోకి ఓ సైనికుడు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రూపొందించిన షార్ట్‌ ఫీచర్‌ ఇద’’న్నారు దిల్‌ రాజు.

Updated Date - 2023-08-16T03:30:50+05:30 IST