ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు మృతి
ABN , First Publish Date - 2023-01-07T00:11:19+05:30 IST
చిత్ర పరిశ్రమలో మరో విషాదం. ప్రముఖ కళా దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్‌బాబు (50) గుండెపోటుతో మరణించారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం. ప్రముఖ కళా దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్‌బాబు (50) గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల కిత్రం కాలువాపుతో ఆయన ఎర్నాకులంలోని ఓ హాస్పిటల్‌లో చేరారు. గురువారం అర్థరాత్రి కేరళలోని సొంత ఇంట్లో ఆయన కన్నుమూశారు. సునీల్‌బాబుకు భార్య, కూతురు ఉన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆయన మృతికి సంతాపం తెలిపింది. ప్రముఖ కళా దర్శకుడు సాబుసిరిల్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన సునీల్ తర్వాత మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘ఉరుమి’, ‘ప్రేమమ్’, ‘లక్ష్యం’, ‘సీతారామం’ ఆయనకు గుర్తింపు తెచ్చాయి. సునీల్‌బాబు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ‘వారసుడు’ సంక్రాంతికి విడుదలవుతోంది.