వరలక్ష్మి ఆగమనం
ABN , First Publish Date - 2023-12-05T02:04:40+05:30 IST
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాసామి రంగ’. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు...
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాసామి రంగ’. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కథానాయిక. ఈ చిత్రంలో ఆషిక ‘వరలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నారు. సోమవారం చిత్రబృందం వరలక్ష్మిగా ఆషిక ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో లంగావోణీలో ఆషిక సంప్రదాయ బద్ధమైన లుక్‌తో ఆకట్టుకొంటోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. 2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.