గరుడ ఆగమనం
ABN , First Publish Date - 2023-07-05T02:44:36+05:30 IST
సత్యదేవ్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. క్రాంతి బాల దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత. మంగళవారం సత్యదేవ్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని...
సత్యదేవ్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. క్రాంతి బాల దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత. మంగళవారం సత్యదేవ్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే పేరు ఫిక్స్ చేశారు. ఓ చేతిలో కాగడా, మరో చేతిలో ఆయుధం, భుజం మీద ఓ పాపతో సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చారు. రెండు చాప్టర్లుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యాక్షన్, ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇదని ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది. ‘‘ఇదివరకెప్పుడూ సత్యదేవ్ చేయని పాత్ర ఇది. కథ, కథనాలు నవ్యరీతిలో సాగుతాయి. పేరున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నార’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్.