నా కథలో నువ్వున్నావా?

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:05 AM

‘సత్యం’ రాజేశ్‌, మేఘా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘టెనెంట్‌’. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖరరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ‘నా కథలో నువ్వున్నావా...

నా కథలో నువ్వున్నావా?

‘సత్యం’ రాజేశ్‌, మేఘా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘టెనెంట్‌’. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖరరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ‘నా కథలో నువ్వున్నావా.. నీ కథనే నేనయ్యానా.. నా జతగా రానున్నావా.. నీ జతనై రమ్మంటావా’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. సాహిత్యసాగర్‌ రచించి స్వర పరిచిన పాట ఇది. దీని గురించి దర్శకుడు వివరిస్తూ ‘భార్యాభర్తల అనురాగాన్ని, ఆప్యాయతను తెలియజేసే పాట ఇది. జీవితం ఆడే వైకుంఠపాళీలో పాచికల్లాంటి ఆరు పాత్రల మధ్య జరిగే కథ ఈ చిత్రం. ముఖ్యంగా ప్రస్తుతం అర్బన్‌ లైౖఫ్‌ స్టయిల్‌ని చూపిస్తూ మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పే సినిమా ఇది’ అన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 01:06 AM