సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమితాబ్‌ కంటే మేమేం తక్కువ?

ABN, First Publish Date - 2023-04-18T03:15:01+05:30

‘ఎనబై ఏళ్ల వయసులో కూడా అమితాబ్‌ బచ్చన్‌కు మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలు సృష్టిస్తున్నారు. కానీ పాతతరం హీరోయిన్లమైన నన్ను కానీ, తనూజనీ కానీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఎనబై ఏళ్ల వయసులో కూడా అమితాబ్‌ బచ్చన్‌కు మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలు సృష్టిస్తున్నారు. కానీ పాతతరం హీరోయిన్లమైన నన్ను కానీ, తనూజనీ కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. బామ్మ పాత్రలు వేసీ వేసీ బోర్‌ కొడుతోంది. అమితాబ్‌లా మా గురించి ప్రత్యేక పాత్రలు సృష్టించవచ్చు కదా. ఆయనకంటే మేమేం తక్కువ?’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు అలనాటి హీరోయిన్‌ ఆశా పరేఖ్‌. ‘హీరోయిన్లకు పెళ్లయితే వారి కెరీర్‌ క్లోజ్‌ అయిపోతుంది. కానీ హీరోలు మాత్రం 50 ఏళ్లు వచ్చినా, 60 ఏళ్లు వచ్చినా నటిస్తూనే ఉన్నారు. అదేమి విచిత్రమో కానీ ప్రేక్షకులు కూడా వారిని ఆ వయసులో కూడా ఆదరిస్తున్నారు’ అన్నారామె. ముంబైలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆశ భారతీయ చిత్రపరిశ్రమలో నటీమణుల పరిస్థితి గురించి ఇలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-04-18T03:15:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!