అమితాబ్ కంటే మేమేం తక్కువ?
ABN , First Publish Date - 2023-04-18T03:15:01+05:30 IST
‘ఎనబై ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్‌కు మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలు సృష్టిస్తున్నారు. కానీ పాతతరం హీరోయిన్లమైన నన్ను కానీ, తనూజనీ కానీ...
‘ఎనబై ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్‌కు మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలు సృష్టిస్తున్నారు. కానీ పాతతరం హీరోయిన్లమైన నన్ను కానీ, తనూజనీ కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. బామ్మ పాత్రలు వేసీ వేసీ బోర్ కొడుతోంది. అమితాబ్‌లా మా గురించి ప్రత్యేక పాత్రలు సృష్టించవచ్చు కదా. ఆయనకంటే మేమేం తక్కువ?’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు అలనాటి హీరోయిన్ ఆశా పరేఖ్. ‘హీరోయిన్లకు పెళ్లయితే వారి కెరీర్ క్లోజ్ అయిపోతుంది. కానీ హీరోలు మాత్రం 50 ఏళ్లు వచ్చినా, 60 ఏళ్లు వచ్చినా నటిస్తూనే ఉన్నారు. అదేమి విచిత్రమో కానీ ప్రేక్షకులు కూడా వారిని ఆ వయసులో కూడా ఆదరిస్తున్నారు’ అన్నారామె. ముంబైలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆశ భారతీయ చిత్రపరిశ్రమలో నటీమణుల పరిస్థితి గురించి ఇలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.