కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇలాంటి దొంగలు ఉంటారా?

ABN, First Publish Date - 2023-10-08T02:41:19+05:30

‘‘నేను చాలా మృదు స్వభావిని. రిజర్వ్‌డ్‌గా ఉంటా. కానీ అందుకు పూర్తి భిన్నమైన పాత్రని ‘టైగర్‌ నాగేశ్వరావు’లో పోషించా. ఇది నాకు విచిత్రమైన అనుభవం’’ అన్నారు గాయత్రీ భరద్వాజ్‌. ఆమె కథానాయికగా నటించిన చిత్రమిది...

‘‘నేను చాలా మృదు స్వభావిని. రిజర్వ్‌డ్‌గా ఉంటా. కానీ అందుకు పూర్తి భిన్నమైన పాత్రని ‘టైగర్‌ నాగేశ్వరావు’లో పోషించా. ఇది నాకు విచిత్రమైన అనుభవం’’ అన్నారు గాయత్రీ భరద్వాజ్‌. ఆమె కథానాయికగా నటించిన చిత్రమిది. రవితేజ హీరో. ఈనెల 20న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శనివారం గాయత్రీ భరద్వాజ్‌ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ చిత్రంలో మణి అనే పాత్రలో నటించా. పల్లెటూరి అమ్మాయిని. చాలా రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తా. దర్శకుడు నాకు మూడు గంటల కథ చెప్పారు. నా పాత్ర గురించి వివరిస్తున్నప్పుడే నాకు కన్నీళ్లొచ్చాయి. అంత ఎమోషన్‌ ఉంది. నా పాత్రలో చాలా కోణాలు కనిపిస్తాయి. నటిగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే ఒప్పుకొన్నా. దాదాపు అరవైమందిని ఆడిషన్‌ చేశాక నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకే మరింత గర్వంగా అనిపిస్తోంది. రవితేజలాంటి పెద్ద హీరోతో నటించడం నా అదృష్టం. ఆయన కామెడీ టైమింగ్‌ అద్భుతం. సెట్లో ఆయన సహకారం మర్చిపోలేనిది. ఈ పాత్ర విషయంలో దర్శకుడ్ని పూర్తిగా నమ్మాను. ఆయన ఏం చెబితే అది చేశాను. అందుకే ఈ పాత్రకు ఎంత మంచి పేరొచ్చినా క్రెడిట్‌ మొత్తం దర్శకుడికే ఇస్తా. ఈ సినిమాలో ఎవరూ ఊహించని యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. మాస్‌కి బాగా నచ్చుతుంది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ గురించి నాకు అస్సలు తెలీదు. దర్శకుడు చెప్పిన తరవాత.. అసలు ఇలాంటి దొంగలు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయా. తెరపై ‘టైగర్‌’ని చూస్తున్నప్పుడు ప్రేక్షకులకూ అలాంటి ఫీలింగ్‌ కలుగుతుంద’’న్నారు.

Updated Date - 2023-10-08T02:41:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!