AP31: ఇది విశాఖపట్నం బండి
ABN , First Publish Date - 2023-08-21T02:20:48+05:30 IST
చంటి, లహరి జంటగా నటించిన చిత్రం ‘ఏపీ 31’. మిస్సింగ్ నెంబర్ అనేది ట్యాగ్ లైన్. కెవిఆర్ దర్శకుడు. నారాయణ స్వామి నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

చంటి, లహరి జంటగా నటించిన చిత్రం ‘ఏపీ 31’. మిస్సింగ్ నెంబర్ అనేది ట్యాగ్ లైన్. కెవిఆర్ దర్శకుడు. నారాయణ స్వామి నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ ‘‘ఏపీ 31 అనేది విశాఖపట్నం బండి. ఈ నెంబర్‌ని టైటిల్‌గా పెట్టడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ బండి బాక్సాఫీసు దగ్గర దూసుకుపోవాల’’ని ఆకాంక్షించారు.
చిత్ర దర్శకుడు కె.వి.ఆర్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో పదేళ్లుగా ఉంటున్నాను. నాలుగేళ్ల నుంచి నిర్మాత నారాయణ స్వామిగారితో పరిచయం ఉంది. 2019లోనే ఆయన నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే సినిమాను చేస్తున్నారు. అది కూడా భారీగా చేస్తున్నారు. మంచి నటీనటులు, టెక్నీషియన్స్ ను ఇచ్చి సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్, డైలాగ్ రైటర్ భాష్యశ్రీ అందరూ సూపర్ ఔట్ పుట్ ఇచ్చారు. ఇక దర్జా సినిమా నుంచి పరిచయం ఉన్న సలీం మాలిక్ గారు అడిషనల్ స్క్రీన్ ప్లే అందించారు. హీరో చంటిని స్క్రీన్ పైన చూస్తుంటే ఫస్ట్ టైమ్ హీరోలా అనిపించరు. అంత చక్కగా నటించారు. లహరిగారు చాలా డేడికేషన్‌తో వర్క్ చేశారు. అద్భుతంగా నటించారు. అందరి సపోర్ట్‌తో సినిమాను కూల్‌గా పూర్తి చేస్తున్నాం. ఇంత మంచి టీమ్‌ని నాకు ఇచ్చిన నిర్మాత నారాయణ స్వామిగారికి థాంక్స్ అని తెలిపారు.