సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆత్మల కోసం అన్వేషణ

ABN, First Publish Date - 2023-05-02T00:09:23+05:30

విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘అన్వేషి’. విజే ఖన్నా దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘అన్వేషి’. విజే ఖన్నా దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. సోమవారం ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు చేతుల మీదుగా టీజర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో సైకలాజికల్‌ థ్రిల్లర్‌. డిటెక్టివ్‌ కావాలనుకొన్న యువకుడు ప్రేమలో పడతాడు. ఓ పనిమీద మారేడు కోనకు వెళ్లాల్సివస్తుంది. అక్కడే తన జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఆత్మలు ఉన్నాయా? లేదా? అనే అన్వేషణలో ఆ డిటెక్టివ్‌కి ఎలాంటి నిజాలు తెలిశాయి. అసలు ఆత్మలు నిజంగానే ఉంటే ఏమవుతుంది? ఈ కోణంలో జరిగే కథ ఇది. సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం’’ అన్నారు.

Updated Date - 2023-05-02T00:09:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!