నవంబర్‌లో వస్తున్న ‘అన్వేషి’

ABN , First Publish Date - 2023-10-17T03:07:59+05:30 IST

విజయ్‌ ధరణ్‌ దాట్ల , సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అన్వేషి’. వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతిరెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్‌ రెండో వారంలో...

నవంబర్‌లో వస్తున్న ‘అన్వేషి’

విజయ్‌ ధరణ్‌ దాట్ల , సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అన్వేషి’. వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతిరెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్‌ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత పుట్టిన రోజు సందర్భంగా సోమవారం చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ‘ట్రైలర్‌ బాగుంది. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి’ అన్నారు. నిర్మాత గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘నాకు ఇదే తొలి సినిమా. చాలా చిత్రాలు నిర్మించాలనే కోరికతో పరిశ్రమలోకి ప్రవేశించాను. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా బాగా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశాను. ఈ నెలలోనే అశ్విన్‌ హీరోగా ఒక సినిమా ప్రారంభించబోతున్నాను’ అన్నారు.

Updated Date - 2023-10-17T03:07:59+05:30 IST