Mangalavaram : అన్వేషణ, అరుంధతి గుర్తొచ్చాయి
ABN , First Publish Date - 2023-11-19T02:32:37+05:30 IST
‘‘మంగళవారం’ సినిమా కథ విన్నప్పుడు ‘అన్వేషణ’ గుర్తొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు ‘అరుంధతి’ కళ్ల ముందు మెదిలింది’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. పాయల్ రాజ్‌పూత్ ప్రధానపాత్రలో...

‘‘మంగళవారం’ సినిమా కథ విన్నప్పుడు ‘అన్వేషణ’ గుర్తొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు ‘అరుంధతి’ కళ్ల ముందు మెదిలింది’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. పాయల్ రాజ్‌పూత్ ప్రధానపాత్రలో దర్శకుడు అజయ్‌భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ చిత్రం విజయోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘కొత్తనటీనటులతో అజయ్ అద్భుతమైన విజయం సాధించాడు. కథ నచ్చడంతో నైజాం హక్కులు తీసుకున్నా’ అన్నారు. ఆర్‌ఎక్స్ 100 కంటే మంచి సినిమా తీశావ్ అని ప్రేక్షకులు ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉందన్నారు అజయ్ భూపతి. ‘ఒక్క సినిమాతో నా పని అయిపోయిందనుకున్నారు, మంగళవారంతో అది తప్పని నిరూపించాను’ అని పాయల్ రాజ్‌పుత్ చెప్పారు. ఇంత పెద్ద విజయాన్నిచ్చినందుకు ప్రేక్షకులకు నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి ధన్యవాదాలు తెలిపారు.