యముడి కథతో మరో సినిమా

ABN , First Publish Date - 2023-03-25T02:54:00+05:30 IST

యముడి పాత్ర సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకులను అలరించాయి. ఆ కోవలో వస్తున్న మరో చిత్రం ‘యమ డ్రామా’....

యముడి కథతో మరో సినిమా

యముడి పాత్ర సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకులను అలరించాయి. ఆ కోవలో వస్తున్న మరో చిత్రం ‘యమ డ్రామా’. హర్షా చౌదరి దర్శకత్వంలో తోటకూర శివరామకృష్ణారావు ఈ సినిమాను నిర్మించారు. యువచంద్ర, శివకుమార్‌, కౌటిల్య, సుదర్శన్‌ రెడ్డి హీరోలుగా, ప్రియాంక శర్మ, నేహాదేశ్‌ పాండే, హమీద హీరోయిన్లుగా నటించారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ నటి, రాజకీయనాయకురాలు విజయశాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేటి ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీసినట్లు దర్శకనిర్మాతలు చెప్పారు. ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకుని వారు ఈ సినిమా నిర్మించినట్లు అర్థమైంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరింపజేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. చిత్ర దర్శకుడు హర్షా చౌదరి మాట్లాడుతూ ‘మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌తో చక్కని సందేశం కూడా చిత్రంలో ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా చిత్రాన్ని రూపొందించాం. సీనియర్‌ నటుడు సాయికుమార్‌ ఇందులో యముడిగా నటించారు’ అని చెప్పారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తోటకూర శివరామకృష్ణ చెప్పారు.

Updated Date - 2023-03-25T02:54:02+05:30 IST