అడవిలో అన్నల పోరాటం

ABN , First Publish Date - 2023-01-21T05:29:47+05:30 IST

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సిందూరం’. శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకుడు...

అడవిలో అన్నల పోరాటం

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సిందూరం’. శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకుడు. ప్రవీణ్‌ రెడ్డి జంగా నిర్మాత. ఈనెల 26న విడుదల చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ ఆవిష్కరించారు. ‘‘నక్సల్‌ ఉద్యమ నేపథ్యంలో సాగే కథ ఇది. వ్యవస్థని సరిదిద్దడానికి.. సమాంతరంగా మరో వ్యవస్థ రూపుదిద్దుకొంటుందన్న సామాజిక ధర్మాన్ని ఈ కథలో చూపిస్తున్నాం. పోలీసులకు, నక్సలైట్లకూ జరిగే పోరాటం మాత్రమే కాదు, ఇందులో ఓ ప్రేమకథ కూడా ఉంటుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-01-21T05:29:48+05:30 IST