తొలిసారి యాక్షన్‌ ఎంటర్టైనర్‌లో

ABN , First Publish Date - 2023-09-10T00:56:52+05:30 IST

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గం గం గణేశా’. ఉదయ్‌ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు..

తొలిసారి యాక్షన్‌ ఎంటర్టైనర్‌లో

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గం గం గణేశా’. ఉదయ్‌ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘గం గం గణేశా’ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ శనివారం విడుదల చేశారు. రెండు తుపాకులు పట్టుకున్న ఆనంద్‌, నేపథ్యంలో బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని యూనిట్‌ తెలిపింది. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిశోర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌

Updated Date - 2023-09-10T00:56:52+05:30 IST