Anand Baby Movie: ‘అర్జున్ రెడ్డి’కే ఎసరు పెట్టిన ‘బేబీ’.. పాపం పెద్ద కొండన్న..!

ABN , First Publish Date - 2023-07-26T17:33:29+05:30 IST

తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన బోల్డ్ లవ్ స్టోరీస్ జాబితాలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఉన్న స్థానమే వేరు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై విడుదలకు ముందు ఎన్ని విమర్శలొచ్చినప్పటికీ విడుదల అనంతరం ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించింది. యూత్ ఆ రేంజ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఆదరించారు.

Anand Baby Movie: ‘అర్జున్ రెడ్డి’కే ఎసరు పెట్టిన ‘బేబీ’.. పాపం పెద్ద కొండన్న..!

తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన బోల్డ్ లవ్ స్టోరీస్ జాబితాలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఉన్న స్థానమే వేరు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై విడుదలకు ముందు ఎన్ని విమర్శలొచ్చినప్పటికీ విడుదల అనంతరం ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించింది. యూత్ ఆ రేంజ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఆదరించారు. అప్పట్లో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మాదిరిగానే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ బొమ్మగా నిలిచి కోట్లు కొల్లగొడుతోంది.

DIdlh3TUQAAUPlA.jpg086A6C19-8A1E-4D95-8086-871ED20D0567.jpeg

చిన్న సినిమాగా వచ్చినప్పటికీ పెద్ద విజయాన్ని అందుకుంది. 11 రోజుల్లో 70 కోట్లను ‘బేబీ’ సినిమా కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ స్వయంగా వెల్లడించింది. ఈ సంవత్సరం విడుదలై బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటిగా ‘బేబీ’ నిలిచింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కలెక్షన్లను ‘బేబీ’ సినిమా దాటేసింది.


‘అర్జున్ రెడ్డి’ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.21.35 కోట్లను కలెక్ట్ చేస్తే.. ‘బేబీ’ సినిమా ఏకంగా 70 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. వికీపీడియా లెక్కల ప్రకారం చూసుకున్నా.. అర్జున్ రెడ్డి మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ.51 కోట్లు కాగా, ‘బేబీ’ సినిమా గ్రాస్ కలెక్షన్ రూ.70 కోట్లు కావడంతో పెద్ద కొండన్న రికార్డును చిన్న కొండన్న బ్రేక్ చేశాడని ఇంటర్నెట్‌లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

babymovie.jpgFa_eoqLVsAMoBAA.jpg

‘బేబీ’ సినిమా కలెక్షన్లపై నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ విజయ్ దేవరకొండతో ‘ట్యాక్సీవాలా’ సినిమాతో హిట్ కొట్టానని, ‘బేబీ’ సినిమాతో ఆనంద్ దేవరకొండకు కూడా హిట్ ఇవ్వడం.. ‘మాస్ మూవీ మేకర్స్’లో బ్రదర్స్ ఇద్దరికీ బ్లాక్‌బస్టర్స్ ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు.

Updated Date - 2023-07-26T17:33:33+05:30 IST