చరిత్రకెక్కని కథ

ABN , First Publish Date - 2023-08-27T02:29:52+05:30 IST

అరోరా శ్రీ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘హలో బేబీ’. రాం గోపాల్‌ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాత...

చరిత్రకెక్కని కథ

అరోరా శ్రీ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘హలో బేబీ’. రాం గోపాల్‌ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాత. శనివారం చిత్రీకరణ ప్రారంభమైంది. దర్శకుడు యాదకుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నా బేనర్‌లో ఇది ఏడో చిత్రం. ఇప్పటివరకూ ఇండియన్‌ హిస్టరీలో లేని కథతో ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. మంచి కథతో దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని రాం గోపాల్‌ రత్నం చెప్పారు. విభిన్నమైన కథలో ఛాలెంజింగ్‌గా ఉండే పాత్ర చేస్తున్నానని అరోరా శ్రీ తెలిపారు. ఈ చిత్రానికి నితిన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రమణ

Updated Date - 2023-08-27T02:29:52+05:30 IST