Mr Pregnant : నా జీవితంలో మర్చిపోలేని ఘట్టమది!

ABN , First Publish Date - 2023-08-06T03:07:06+05:30 IST

‘‘డెలివరీ అంటే ఓ ప్రాణం పోయడం. అఖిల్‌ కడుపులో ఉన్నప్పుడు ఆరు నెలలు షూటింగులన్నీ మానేసి అమలతోనే ఉన్నా. అది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం’’ అన్నారు నాగార్జున....

Mr Pregnant : నా జీవితంలో మర్చిపోలేని ఘట్టమది!

‘‘డెలివరీ అంటే ఓ ప్రాణం పోయడం. అఖిల్‌ కడుపులో ఉన్నప్పుడు ఆరు నెలలు షూటింగులన్నీ మానేసి అమలతోనే ఉన్నా. అది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం’’ అన్నారు నాగార్జున. సోహైల్‌ కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో నాగార్జున ఆవిష్కరించారు. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకుడు. మైక్‌ మూవీస్‌ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా నాగ్‌ మాట్లాడుతూ ‘‘ఓ మగాడు ప్రెగ్నెంట్‌ ఎలా అయ్యాడన్నది ఈ కథలో చాలా ఆసక్తిని కలిగించే పాయింట్‌. దర్శకుడు బాగా తెరకెక్కించారనిపిస్తోంది. ట్రైలర్‌ చూస్తే... సినిమా చూడాలన్న కోరిక కలుగుతోంది. సోహైల్‌ బాగా కష్టపడతాడు. అతని కష్టమే ఈ చిత్రాన్ని హిట్‌ చేస్తుంద’’న్నారు. ‘‘తొమ్మిది నెలలు కష్టపడి ఓ బిడ్డని మోసి జన్మనిస్తుంది తల్లి. ఆ కష్టం ఎలా ఉంటుందో నా పాత్ర ద్వారా తెరపై చూపించారన’’న్నారు సోహైల్‌. ఈనెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-08-06T03:07:06+05:30 IST