ఊహించని విజయమిది

ABN , First Publish Date - 2023-03-19T00:38:06+05:30 IST

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా నటించారు. నటుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ చిత్రం చక్కని ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది...

ఊహించని విజయమిది

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా నటించారు. నటుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ చిత్రం చక్కని ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా హర్షిత్‌, హన్షిత మీడియాతో ముచ్చటించారు.

  • నిర్మాతలుగా తొలిచిత్రం ‘బలగం’తో దక్కిన విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకుల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదు. వసూళ్లు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి.

  • రాజుగారికి సినిమా బాగా నచ్చింది. మా ఇద్దరినీ హత్తుకొని అభినందించారు. ‘మీరు భవిష్యత్తులో నిర్మాతలుగా ఎంత గొప్ప సినిమాలు అయినా తీయొచ్చు కానీ ‘బలగం’ సినిమా మాత్రం మీకు జీవితకాలం మిగిలిపోయే తీపి జ్ఞాపకం అవుతుంద’ని అన్నారు.

  • చిత్ర నిర్మాణంలో రాజుగారు, శిరీ్‌షగారు సలహాలు ఇచ్చారు. కానీ అంతిమ నిర్ణయం మాత్రం మేమే తీసుకున్నాం. ఈ బేనర్‌లో కొత్తతరహా చిత్రాలు చేయాలనేది మా ప్రయత్నం. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తాం.

Updated Date - 2023-03-19T00:38:13+05:30 IST