కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధైర్యాన్నిచ్చే సినిమా

ABN, First Publish Date - 2023-09-12T00:57:46+05:30

నవీన్‌చంద్ర, స్వాతిరెడ్డి జంటగా నటించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ శ్రీకాంత్‌ నాగోతి దర్శకుడు. యశంత్‌ ములకులట్ల నిర్మాత. అక్టోబర్‌ 6న విడుదల చేస్తున్నారు...

నవీన్‌చంద్ర, స్వాతిరెడ్డి జంటగా నటించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ శ్రీకాంత్‌ నాగోతి దర్శకుడు. యశంత్‌ ములకులట్ల నిర్మాత. అక్టోబర్‌ 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మాకు తెలిసిన నిజాన్ని నిజాయతీగా చెప్పాం. మేం చూపించిన నిజం ధైర్యం ఇచ్చేలా ఉంటుంది. ఇది ఫిమేల్‌ సెంట్రిక్‌ సినిమా కాదు. అలాగే బాద పడే సినిమా కూడా కాదు. ఽధైర్యాన్ని ఇచ్చే సినిమా’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నవీన్‌చంద్రతో కలసి మళ్లీ చిత్రం చేయాలనుకున్నప్పుడు ఈ కథ అనుకున్నాం. స్వాతి ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారింది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.

Updated Date - 2023-09-12T00:57:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!