ఓ అసాధారణ ప్రయాణం

ABN , First Publish Date - 2023-09-25T01:15:16+05:30 IST

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ‘లక్కీ భాస్కర్‌’ అనే చిత్రాన్ని రూపొందిస్తోంది...

ఓ అసాధారణ ప్రయాణం

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ‘లక్కీ భాస్కర్‌’ అనే చిత్రాన్ని రూపొందిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ‘‘ఓ సాధారణ వ్యక్తి చేసే అసాధారణ ప్రయాణం ఈ కథ. భాస్కర్‌ పాత్ర తెరకెక్కించిన విధానం, ఈ కథని చెప్పే పద్ధతి కొత్త రీతిలో సాగుతాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీకర స్డూడియోస్‌.

Updated Date - 2023-09-25T01:15:16+05:30 IST