హారర్ కామెడీ జానర్‌లో అన్వేషి
ABN , First Publish Date - 2023-11-16T00:51:43+05:30 IST
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన ‘అన్వేషి’ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భగా...

విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన ‘అన్వేషి’ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భగా దర్శకుడు మాట్లాడుతూ ‘సంగీత దర్శకుడు చైతన్ భరధ్వాజ్ ఇచ్చిన చిన్న ట్యూన్‌తో సినిమా చేయాలనే కోరిక నాలో బలంగా పెరిగిపోయింది. అజయ్ ఘోష్‌గారి పాత్ర ఈ సినిమాలో నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అలాగే అనన్య నాగళ్ల చేసిన పాత్ర చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. మా నిర్మాత గణపతిరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే . ఆయన నాకు ఈ సినిమాతో పునర్జన్మ ఇచ్చారు. హారర్ కామెడీ జానర్‌లో తయారైన ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’ అన్నారు. ఓ పల్లెటూరు నుంచి వచ్చి హీరో కావాలని మొదలుపెట్టిన జర్నీలో ఎన్నో అవమానాలు, బాధలు ఎదుర్కొన్నాను. ఈ సినిమా ప్రారంభించినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే చాలా మంది సపోర్ట్ చేయడం సినిమా పూర్తి చేయగలిగాం. నిర్మాత గణపతిరెడ్డిగారు మాకు దేవుడికంటే ఎక్కువ. ఆయనలాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరం’ అన్నారు హీరో విజయ్ ధరణ్ దాట్ల. నిర్మాత గణపతిరెడ్డి మాట్లాడుతూ ‘చిన్న సినిమా తీయడమే ఒక ఎత్తు అయితే, దానిని రిలీజ్ చేయడం మరో ఎత్తు. కానీ మా సినిమాకు ఎలాంటి సమస్యకు లేకుండా మంచి థియేటర్స్ దొరికాయి. యుఎ్‌ఫఓ లక్ష్మణ్ గారు ప్రతి విజయంలో నాకు సహకరిస్తున్నారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిమ్రన్ గుప్తా, సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, అశ్విన్ బాబు, సోహైల్, చైతన్య రావు, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.